నవ్వు నలభైవిధాల మంచిది... ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు అరవై నుండి నూటఆరవై సార్లు నవ్వుతారని అమెరికా శాస్త్రజ్ఞలు తేల్చి చెప్పారు... ఉదయమే నవ్వుతూ రోజును ప్రారంభిస్తే, మిగిలిన రోజు అంతా నవ్వుతూ గడుపుతారని మన పూర్వీకులు చెప్పారు..... కనుక మీకు కొంతసేపు అయినా నవ్వాలని కోరుకుంటూ .........ఈ చిన్న ప్రయత్న౦
Thursday, April 4, 2013
విప్పకుండా తిప్పి పంపడమైనది
70 ఏళ్ళ ముసలావిడ... కాని, కన్య! ఆ విషయంగా గర్వపడేది కూడ. ఇంకెన్నో రోజులు బతకననిపించింది ముసలావిడకి. తన దగ్గర బంధువుకి, తను చనిపోయిన తరువాత తన సమాధి మీద 'కన్యగా పుట్టి, కన్యగా పెరిగి, కన్యగా చనిపోయింది' అని వ్రాయించు అని కోరుకుంది. కొన్నాళ్ళకి ముసలావిడ చనిపోయింది. ఆవిడ కోరుకున్నట్లే సమాధి మీద ఏవి చెక్కాలో చెప్పాడు బంధువు. కాని, అక్షరాలు చెక్కే వ్యక్తి బద్ధకస్తుడు. అంత పొడుగ్గా ఏం చెక్కుదాములే అనుకుని చిన్న వాక్యంతో ముగించాడు: "విప్పకుండా తిప్పి పంపడమైనది!"
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment